ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన అభ్యర్థి ఇమ్మడిల పుట్టినరోజు వేడుకలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన మార్కాపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఇమ్మడి కాశీనాధ్ ల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక రహదారులు మరియు భవనముల శాఖ అతిథి గృహం నందు పట్టణ జనసేన నాయకులు హల్చల్ జహీర్ మరియు నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మార్కాపురం శాసనసభ అభ్యర్థి ఇమ్మడి కాశీనాధ్ హాజరవ్వగా ఇమ్మడి పుట్టినరోజు కూడా ఇదేరోజు కావడంతో జనసేన పట్టణ నాయకులు కార్యకర్తలు పవన్ మరియు ఇమ్మడి ఇరువురి పుట్టినరోజు వేడుకల కేకులను ఇమ్మడిచే కట్ చేయించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దర్శి రోడ్డులోని కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు, ఇమ్మడి అనుచరులు తదితరులు పాల్గొన్నారు.