సామాజిక వైద్యశాలను సందర్శించిన కుందూరు… పలు సమస్యలును కుందూరు దృష్టికి తీసుకువెళ్లిన డాక్టర్ చక్రవర్తి
స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాలను మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రవర్తితో వైద్యశాలలోని పరిస్థితులను స్థితిగతులను అడిగి తీసుకున్నారు. అనంతరం డాక్టర్ చక్రవర్తి వైద్యశాల పరిస్థితులను వివరిస్తూ పాత ఓపి భవనం నిర్మాణం 95శాతం పూర్తి అయిందని త్వరలోనే పూర్తిఅవుతుందని తెలిపారు.
అలాగే వైద్యశాలకు జిల్లా వైద్యశాలగా మార్పు తీసుకుని వస్తే పరిసర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని…. ప్రస్తుతం రోజుకు 300పైగా ఓపిలు వస్తున్నాయని ఒక్కోరోజు 500కూడా వస్తున్నాయని… జిల్లా వైద్యశాలగా మారిస్తే ఇంకా ఓపి శాతం పెరుగుతుందని….. అత్యవసర సేవలు కూడా లభించే అవకాశం ఉందని కాబట్టి జిల్లా వైద్యశాలగా మార్చేందుకు కృషి చేయాలని కుందూరును కోరారు.