గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన లాల్ ఫౌండేషన్
గురుపూజోత్సవ వేడుకలను లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అక్టోబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథపురంలోని పెన్షనర్ల భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పలువురు వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తర్వాత అంతటి అరుదైన స్థానం గురువుదే అని….. గురువులు శిష్యులను తీర్చిదిద్దే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ ఇబ్బందులను ఎంతో ఇష్టంగా స్వీకరించి ప్రయోజకులను చేయడానికి శ్రమిస్తూనే ఉంటారని…… అటువంటి గురువులకు జన్మాంతం ఋణపడి ఉంటామని గురువుల సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, బాదుల్లా, లాల్ ఫౌండేషన్ సభ్యులు అఖిబ్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.