పెద్ద, చిన్న చెఱువులను జలాశయాలుగా మార్చుటకు డిపిఆర్ సిద్ధం…. నెలలో టెండర్లులకు పిలుపు: ఎంఎల్ఏ నాగార్జున రెడ్డి
పొదిలి పెద్ద, చిన్న చెఱువులను జలాశయాలుగా మార్చుటకు ఇరిగేషన్ అధికారుల డిటేల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్) సిద్ధంగా ఉందని నెలలో టెండర్లకు పిలుపువస్తుందని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక విశ్వనాథపురం వైయస్ఆర్ విగ్రహం వద్ద శుక్రవారంనాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 100రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా పట్టణ నాయకులు షేక్ రబ్బానీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుందూరు నాగార్జునరెడ్డి తొలుత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌళిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని…. అదేవిధంగా పొదిలి మండలం నీటి సమస్య శ్వాశిత పరిష్కారం కొరకు పొదిలి చిన్న, పెద్ద చెఱువులను జలాశయాలుగా మార్చేవిధంగా ఇరిగేషన్ అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారని…. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి టెండర్లు పిలుపునిచ్చి పనులు ప్రారంభం అయ్యేవిధంగా కృషి చేస్తానని…. జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో ఎన్నికల హామీలను 100శాతం అమలుచేసేలా కృషిచేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, సాయిరాజేశ్వరరావు, గొలమారి చెన్నారెడ్డి, నరసింహరావు, మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, కోగర వెంకట్రావ్ యాదవ్, షేక్ నజీర్, ముల్లా ఖాదర్ బాషా, వర్షం ఫిరోజ్, షేక్ గౌస్, షేక్ నాయబ్ రసూల్, షేక్ గౌసి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.