రోగులకు భోజన వసతి కల్పించిన శివరాజు మిత్ర బృందం
పొదిలి ప్రభుత్వ సామాజిక వైద్యశాల ప్రాంగణంలో కుష్టువ్యాధిగ్రస్తులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక ప్రభుత్వ వైద్యశాల నందు ప్రతినెల కుష్టువ్యాధి గ్రస్తులకు మందులు, 10కేజిల బియ్యం ఇతర సమగ్రిల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పొదిలి ప్రాంతంలో సుమారు 110మందికి పైగా వచ్చే కుష్టువ్యాధి గ్రస్థులకు ప్రతి నెల భోజన వసతిని పొదిలి పట్టణానికి చెందిన ప్రముఖ సంఘసేవకులు శివరాజు కల్పించడం హర్షించదగ్గ విషయమని లిటిల్ హర్ట్స్ సొసైటీ వ్యవస్థాపకులు వి శిరీష, అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి, రమణారెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.