విదేశీయుల వివరాలు ఫారం-సి లో నమోదుకాకుండా ఉంటే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ సిద్ధార్థ్
విదేశీయులు ఫారం-సి లో వారి వివరాలను నమోదు చేసుకోకుండా బసచేస్తే విదేశీయులతో పాటుగా ఆశ్రయం కల్పించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా ఇళ్లలో కానీ, అద్దెభవనాలలో కానీ, అతిథి గృహాలలో కానీ, ఇతరత్రా ఏ చోటనైనా విదేశీయులు నివసిస్తున్నా…. 24లోపు బస చేసే తేదీలు, సమయం వంటి పూర్తి వివరాలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ boi.gov.in నందు ఫారం-సి ను ఆశ్రయం కల్పించినవారు విధిగా నమోదు చేయాలని….. ఈ విషయంపై అవగాహన లేక కొంతమంది వివరాలను నమోదు చేయడం లేదని అలా వివరాలను నమోదు చేయకపోతే ఫారెనర్స్ యాక్టు 1946 ప్రకారం శిక్షార్హులు అవుతారని కాబట్టి ఆశ్రయం కల్పించేవారు ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని……
విదేశీ విద్యార్థులు చదువుల నిమిత్తం నివసిస్తూ ఉంటే అటువంటివారు ఫారం – ఎస్ ద్వారా తమ వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.