ఆరువేలు విలువచేసే గుట్కాలు స్వాధీనం….. ముగ్గురిపై కేసు నమోదు
ఆరువేలు విలువ చేసే నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పొదిలి యస్ఐ సురేష్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి మూడు దుకాణాలలో దాడులు జరపి అక్రమంగా నిల్వఉంచి అమ్మకాలు జరుపుతున్న 6వేల రూపాయలు విలువకలిగిన నిషేధిత గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకుని అమ్మకాలు జరుపుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.