ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పొదిలి ఎస్ఐ సురేష్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలిలోని హొండా షోరూంకి సంబంధించిన నిమ్మగడ్డ జితేంద్ర అనే వ్యక్తి పట్టణానికి చెందిన బత్తుల అంజమ్మ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ గత సంవత్సరం 2018లో లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసి ఇప్పటివరకు తీసుకున్న నగదు చెల్లించకపోవడంతో పొదిలి పోలీసు స్టేషన్ “స్పందన” వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డ జితేంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.