భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు… పీర్ల అభివాదం తిలకించిన వేలాదిమంది ప్రజలు
మొహర్రం పండుగను పురస్కరించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పొదిలిలోని తూర్పుపాలెం, పడమటిపాలెం లలో పీర్లఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఇస్లాం కొత్తనెల ప్రారంభం అయిన పదవ రోజు మొహర్రం పండుగ నిర్వహిస్తారు. ముస్లింలు మొహర్రం పండుగను సంతాప దినాలుగా ఆచరించే మొహర్రం పండుగ సందర్భంగా బుధవారంనాడు పట్టణంలోని ముస్లిం వీధులలో పీర్లు ఊరేగింపుగా వెళ్లి భక్తులచే విశేషంగా పూజలందుకుని అభివాదం అందుకునేందుకు ఒంగోలు కర్నూలు రహదారిలోని అమ్మవారిశాల వద్దకు చేరుకున్న అనంతరం అభివాద దృశ్యాలు వీక్షించేందుకు పట్టణ మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అభివాద దృశ్యాలను తనివితీరా వీక్షించారు.
వేలాదిమంది పాల్గొనే మొహర్రం వేడుకలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.