హైకోర్టు తరలింపు ఆలోచనకు నిరసనగా విధులను బహిష్కరించిన బార్ కౌన్సిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు నిరసనగా రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు గురువారం మరియు శుక్రవారం రెండురోజులు బార్ కౌన్సిల్ లోని అన్ని గ్రూపుల న్యాయవాదులు కోర్టు విధులకు హాజరు కాకుండా బహిష్కరించినట్లు పొదిలి బార్ అసోసియేషన్ నాయకులు దర్నాసి రామారావు, ఎస్ ఎం బాషా, రమణకిషోర్, బోడగిరి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉడుముల గురువారెడ్డి, బి సురేష్ కుమార్, జె వి సుబ్బారావు, షేక్ సలీం, జివి సుబ్బారావు, వెలిశెట్టి వెంకటేశ్వర్లు, షేక్ రబ్బానీ, ఐ శైలజ, ముల్లా నాయబ్ రసూల్, శ్రీనివాసులు, పెద్దయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు