ప్రత్యేక స్పందన కార్యక్రమం విజయవంతం
మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పందన కార్యక్రమం విజయవంతమైంది.
వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు స్ధానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలపై 88దరఖాస్తులు రాగా అందులో 20సమస్యలు తక్షణమే పరిష్కారం చేశారు. మిగిలిన దరఖాస్తులను విచారణ జరిపి పరిష్కరిస్తామని మండల రెవెన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బరాయుడు, మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.