ఆక్టోబర్ 18వరకు అయోధ్య భూవివాదం కేసు విచారణ తీర్పు రిజర్వ్డ్
అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించిన విచారణ అక్టోబర్ 18వరకు విచారణ జరిపి తదుపరి తీర్పు రిజర్వ్డ్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు.
రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ భూవివాదంపై రోజువారి విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం
బుధవారంనాడు విచారణ సమయంలో న్యాయవాదులు ఎప్పుటివరకు విచారణ జరుగుతుందనే విషయం తెలపాలని కోరగా అక్టోబర్ 18తేదీ నాటికి పూర్తి చేసి తీర్పును రిజర్వ్డ్ చేస్తామని తెలిపారు.
అయితే నవంబర్ 30వ తేదికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేయబోతున్న విషయం తెలిసిందే.