తేజస్ యుద్ధ విమానంలో భారత రక్షణమంత్రి విహంగవీక్షణం

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారంనాడు బెంగుళూరులోని హిందుస్ధాన్ ఏరోనాటికల్ సంస్థ నందు తేలికపాటిదైన యుద్ధ విమానం తేజస్ లో 30నిమిషాలపాటు విహరించారు.

తేజస్ యుద్ధ విమానం తేలికపాటిది అయినప్పటికి నిర్దిష్ట లక్ష్యాన్ని మెరుపువేగంతో ఖచ్చితంగా చేరుకుని భారీస్థాయిలో విధ్వంసం సృష్టించి…. అంతే వేగంతో తిరిగి వెనుకకు వచ్చే శక్తిగల తేజస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. గత నాలుగు రోజుల క్రిందట ప్రయోగించి విజయవంతమైన యుద్ధ విమానం తేజస్ లో గురువారంనాడు రక్షణమంత్రి పరిశీలించి విహంగవీక్షణం చేశారు.