ధూమపానం నిషేధ దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు….. బీడీ, సిగరెట్లు నిషేధిస్తుందా ?

ధూమపాన నిషేధ దిశగా కేంద్రప్రభుత్వం యోచిస్తోందా?….. ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది.

ఇటీవల కాలంలోదేశంలో సంవత్సరానికి లక్షలాదిమంది పొగత్రాగడం వలన రోగాలను, ప్రాణహానిని కొనితెచ్చుకొంటున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పొగాకు హానికరమని ఆరోగ్యంగా ఉండేందుకు పొగాకుకు దూరంగా ఉండాలని సూచిస్తూ పలురకాలైన అవగాహనా కార్యక్రమాలు, ప్రకటనలు చేస్తున్నప్పటికీ ధూమపాన ప్రియులలో మార్పు రాకపోగా కొత్తగా అలవాటు చేసుకునేవారి సంఖ్య కూడా పెరిగిందనే చెప్పాలి….. పొగాకు ఉత్పత్తులు నిషేధిస్తే తప్పితే మార్పు కనిపించేలా లేదని కేంద్రం అనుకుందో ఏమో కాని పొగాకు ఉత్పత్తుల నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కేంద్రప్రభుత్వ చర్యలలో భాగంగా ప్రస్తుత మార్కెట్లో ఈ-సిగరెట్ల వైపు ధూమపాన ప్రియులు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో వారికి షాక్ ఇస్తూ ఈ-సిగరెట్లను నిషేధించింది. ఇదిలా ఉంటే ప్రజారోగ్యం దృష్ట్యా త్వరలోనే పొగాకు సంబంధిత బీడీ, సిగరెట్ వంటి ఉత్పత్తులను కూడా కేంద్రప్రభుత్వం నిషేదించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.