ప్రధానవీధిలో ట్రాక్టర్ బోల్తా…. తప్పిన ప్రమాదం

స్థానిక చిన్న బస్టాండ్ సెంటర్ లో ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన శనివారంనాడు రాత్రి 8:30గంటల సమయంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక పెద్దబస్టాండ్ నుండి చిన్నబస్టాండ్ వరకు ఉన్న ఒంగోలు-కర్నూలు రహదారి దుకాణాలతో కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది.

శనివారంనాడు మొద్దుల లోడుతో వస్తున్న ఒక ట్రాక్టర్ స్థానిక చిన్నబస్టాండ్ లోని ఓ కూరగాయల దుకాణంవద్ద రోడ్డుపై బోల్తా పడడంతో రోడ్డుపై అలాగే కూరగాయల దుకాణంలోనికి కూడా మొద్దుల పడ్డాయి. అయితే నిత్యం రద్దీగా ఉండే ప్రధానవీధి అయినప్పటికీ ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో కూరగాయల దుకాణ యజమానుల అప్రమత్తత వలన ఎవరికి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే ఒక ద్విచక్ర వాహనంపై, అలాగే దుకాణంలో మొద్దులు పడడంతో స్వల్ప ఆర్ధిక నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.సంఘటన జరిగిన ప్రదేశం నుండి ట్రాక్టర్ డ్రైవర్ పరార్ కావటం పూర్తి వివరాలు అందవలసి ఉంది