ఒకేదేశం-ఒకేకార్డు దిశగా కేంద్రం అడుగులు
భారతదేశ వ్యాప్తంగా ఒకే బహుళార్దక ప్రయోజన కార్డును తీసుకుని వచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
ఒకేదేశం- ఒకేరాజ్యాంగం-ఒకేచట్టం దిశగా భారతప్రభుత్వం విజయవంతం కావడంతో అందులో భాగంగా ఒకేదేశం- ఒకేకార్డు అమల్లోకి తీసుకుని వచ్చేవిధంగా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా దేశమంతా ఒకేగుర్తింపు కార్డును తీసుకుని వచ్చే యోచనలో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాకు తెలిపారు.
వన్ నేషన్ వన్ కార్డ్ పథకం అమల్లోకి వస్తే డిజిటల్ రూపంలో ఆధార్, పాన్, పాస్ పోర్టు, బ్యాంకు ఖాతా, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, డెబిట్, క్రెడిట్ మొదలగు కార్డులన్నీ డిజిటలైజేషన్ ద్వారా ఒకేకార్డుకు అనుసంధానం కానున్నాయి.