పంచాయతీ ఎన్నికల నిర్వాహణ ఎప్పుడు… ఏపీ సర్కారుకు హైకోర్టు నోటీసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు ఆగస్టు 2వ తేదీతో ముగిసిందని…. పాలకవర్గాలు లేకుండా ప్రత్యేకాధికారులతో పంచాయతీల నిర్వహణ జరుగుతుండడంతో ప్రభుత్వ అధికారులకు ఆదనపుభారం పడడంతో వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని…. దానితో గ్రామస్థాయిలో ప్రజాపాలన లేక అభివృద్ధి కుంటుపడిందని…. గ్రామపంచాయతీ ఎన్నికలను త్వరగా నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది టి యోగేష్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన డివిజన్ బెంచ్…… ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో తెలియజేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లకు నోటీసులు జారీ చేసింది.