విచ్చలవిడి మద్యానికి చెక్…. ఇకపై లెక్కతప్పదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్మే విధానానికి చెక్ పెట్టింది. అలాగే మద్యం కొనుగోలు దారులకు కూడా పరిమితి విధిస్తూ మంగళవారంనాడు జీఓ జారీచేసింది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో దశలవారిగా మద్యంపాన నిషేధం అమలుచేస్తామని తెలిపిన ప్రభుత్వం అందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుండి పరిమిత సంఖ్యలో మద్యం షాపులను ఏర్పాటుచేసి ప్రభుత్వమే విక్రయాలు జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని…. అందులో భాగంగా భాగంగా ఒక వ్యక్తికి పరిమిత సంఖ్యలో అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. అలాగే ఒక వ్యక్తి వద్ద

భారతతయారీ విదేశీ మద్యం ఏవైనా 3బాటిళ్ళు…… బీర్లు 6బాటిళ్లు….. కల్లు 3లీటర్లు…. మద్యం అమ్మకాలు జరపాలని… అలాగే ఒక వ్యక్తి వద్ద ఇదే పరిమితిలో నిల్వకలిగి ఉండాలని అలా కాకుండా ఎక్కువ సంఖ్యలో మద్యం బాటిళ్లు కలిగిఉంటే బెల్టుషాపు నిర్వహణ క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.