యుద్ధం అనివార్యమే అయితే భారత్ తో యుద్ధానికి సిద్ధం : ఇమ్రాన్
యుద్ధం అనివార్యమే అయితే భారత్ తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్యసమితి సాధరణ సభ నందు శుక్రవారంనాడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ జమ్మూ&కాశ్మీర్ నందు 56రోజుల నుండి కర్ఫ్యూ విధించి మానవహక్కులను కాలరాస్తున్నారని….. కర్ఫ్యూ ఎత్తివేత జరిగితే రక్తపాతం జరుగుతుందని కవ్వింపుచర్యలకు దిగారు.
ప్రపంచంలో తొలిసారిగా మానవబాంబును పేల్చిన తమిళ ఈలం లిబరేషన్ టైగర్స్ హిందువులని ఆరోపించారు. భారత భూభాగంలో ఏడుశాతం మాత్రమే పాకిస్తానీలు ఉన్నారని…. అవసరం అయితే మాదగ్గర ఉన్న అణుఆయుధాలను ఉపయోగించి దాడికి దిగుతామని భారత్ దగ్గర కూడా అణుఆయుధాలు ఉన్నాయి కాబట్టి యుద్ధమంటూ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
జమ్మూ&కాశ్మీర్ భారత్ మరియు పాక్ రెండుదేశాలకు సంబంధించిన అంశం కాగా మమ్మల్ని సంప్రదించకుండా ఆర్టికల్ 370, 35ఏ ఎలా రద్దు చేశారని…. 80లక్షల ప్రజల కోసం 8లక్షల సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ ఎందుకు విధించారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఎన్నికల సమయంలో బాలకోట్ దాడుల్లో ముగ్గురు చనిపోతే 300మంది ఉగ్రవాదులు చనిపోయారని ప్రచారం చేశారని….. ఇది కేవలం టీజర్ మాత్రమేనని అసలు సినిమా తరువాత ఉందని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ అన్నారని….. మోడీ ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడని….. ఆర్ఎస్ఎస్ హిట్లర్, ముసోలిన్ ఆదర్శంతో మానవహక్కులను కాలరాస్తున్నారని…. తక్షణమే ప్రపంచ దేశాలు కాశ్మీర్ అంశంపై జోక్యం చేసుకోవాలని….. భారత యుద్ధ సన్నాహాలు చేస్తుందని యుద్ధం అనివార్యమే అయితే యుద్ధానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నామని అన్నారు.