పోలీస్ స్టేషన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసుకునే సదుపాయం కలదని పొదిలి యస్ఐ సురేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే ప్రతి సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి నేరుగా పాల్గొని ఫిర్యాదు చేయలేనివారికోసం ప్రకాశం జిల్లా యస్పీ మధ్యాహ్నం 1.30గంటల నుండి 3గంటల వరకు సమయాన్ని నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను విని సంబంధించిన అధికారులకు సమస్య పరిష్కారం కోసం అప్పటికప్పుడు అదేశాలను జారీ చేయడం జరుగుతుందని….. సదరు ఫిర్యాదులను స్పందన ఫిర్యాదులుగానే పరిగణిస్తారని కనుక తగిన పరిష్కారం కోసం వ్యయప్రయాసల గూర్చి ఒంగోలు వెళ్లలేని వారు మద్యహ్నం 1గంటలోగా పొదిలి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యస్ఐ సురేష్ ఒక ప్రకటనలో కోరారు.