అనివార్య కారణాల వలన గ్రామ పంచాయతీ టెండర్లు రద్దు : ప్రత్యేకాధికారి
కొన్ని అనివార్య కారణాల వలన శనివారంనాడు జరగవలసిన గ్రామ పంచాయతీ టెండర్లను రద్దు చేసినట్లు గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామపంచాయతీ నందు 7విభాగాలకు సంబంధించిన టెండర్లకు 28వతేది శనివారంనాడు ఆహ్వానం పలుకడంతో భారీ సంఖ్యలో ప్రజలు టెండర్లు వేసేందుకు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు.
టెండర్లు రద్దు చేయడం జరిగిందని పంచాయతీ అధికారులు తెలపడంతో…. టెండర్లు వేసేందుకు వచ్చిన ప్రజలు ఇలాగే రెండు నెలల క్రితం టెండర్లు పిలిచి రద్దుచేసి మరలా నేడు కూడా రద్దుచేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వలన టెండర్ల కార్యక్రమం రద్దుచేయడం జరిగిందని…. జిల్లా పంచాయతీ అధికారికి సంబంధిత నివేదికను పంపించి జిల్లా అధికారులు ఆదేశాల మేరకు తదుపరి వివరాలను గురించి తెలియజేస్తామని తెలిపారు.