రేపటి నుండే నూతన మద్యం పాలసీ…పరిమితికి మించి మద్యం బాటిళ్లు కలిగిఉంటే కేసు నమోదు : అబ్కారీ సిఐ వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమలలో భాగంగా ప్రభుత్వం మద్యం షాపులను ఏర్పాటుచేసి ప్రభుత్వమే విక్రయాలు జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని పొదిలి అబ్కారిశాఖ సిఐ వెంకట్రావు అన్నారు.

స్ధానిక అబ్కారిశాఖ కార్యాలయంలో ఆయనను కలిసిన పొదిలిటైమ్స్ ప్రతినిధితో మాట్లాడుతూ పొదిలి ఆబ్కారీశాఖ సర్కిల్ పరిధిలో ఎంపిక చేసిన ప్రతి షాపులో ఇద్దరు సేల్స్ మెన్ లు, ఒక సూపర్ వైజర్, రాత్రిపూట ఒక కాపలాదారు ఉంటారని….. పొదిలి సర్కిల్ పరిధిలో పొదిలి మండలంలో 7 షాపులు, తాళ్లురు మండలంలో 5షాపులు, మర్రిపూడి మండలంలో 2 షాపులు, కొనకనమిట్ల మండలంలో 2షాపులు చొప్పున మొత్తం 16షాపులు ఏర్పాటు చేశామని…. గతంలో ఉన్న విధంగా మద్యం సేవించేందుకు ఏర్పాటు చేసిన పర్మిట్ రూములు రద్దు చేశామని అన్నారు.

అదేవిధంగా ఒక వ్యక్తి వద్ద ఏవైనా 3బాటిళ్ళు…… బీర్లు 6బాటిళ్లు….. మాత్రమే ఉండలని అంతకు మించి కలిగిఉంటే బెల్టుషాపు నిర్వహణ క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని…. మద్యం షాపులు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని తెలిపారు.