రేపు గ్రామ సచివాలయ భవనం ప్రారంభం : ఎంపిడిఓ శ్రీకృష్ణ
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారంనాడు పొదిలి మండలం కంభాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఒక ప్రకటన లో తెలిపారు.
నూతన సచివాలయ భవన ప్రారంభానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి హాజరై ప్రారంభిస్తారని కావున ఈ కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని కోరారు.