ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గాంధీజి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అనంతరం స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని… పర్యావరణాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ పుర వీధులలో ప్లాస్టిక్ వాడకం దానివలన జరిగే అనర్ధాలపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.