గ్రామ సచివాలయ మొదటి భవనాన్ని ప్రారంభించిన కుందూరు…
మండలంలోని మొదటి గ్రామ సచివాలయం నూతన భవనాన్ని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే బుధవారం స్ధానిక కంభాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను మహత్మాగాంధీ 150జయంతి సందర్భంగా అమలు చేయడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య కలను స్వాతంత్ర్యం వచ్చిన 73సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కలను సాకరం చేశారని అన్నారు.
అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 72గంటల్లో దరఖాస్తు దారుల సమస్య పరిష్కారం అయ్యే విధంగా….. అలాగే కొన్ని రకాల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి పంపించి సత్వర పరిష్కారం జరిగేలా పని చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండలంలోని వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.