మహాత్మాగాంధీ 150జయంతి సందర్భంగా 150రూపాయల నాణెం అవిష్కరించిన మోడీ
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ 150రూపాయల నాణెం ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీకి చేరుకున్న భారత ప్రధాని మోడీ రాజ్ ఘాట్ వద్ద గాంధీజీ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడినుండి బయలుదేరి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ సబర్మతి ఆశ్రమానికి చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీ 150వ జయంతి సందర్భంగా రూపొందించిన 150రూపాయల నాణేన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాణి, సబర్మతి ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.