జూనియర్ లైన్ మెన్లు శిక్షణ తరగతులు
గ్రామ మరియు వార్డు సచివాలయల్లో ఎంపికైన ఎనర్జిటిక్ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్లు గ్రేడ్ 2)లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. వివరాలు లోకి వెళితే శుక్రవారం నాడు స్ధానిక సాయి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కనిగిరి డివిజన్ పరిధిలో విధుల్లోకి చేరిన ఉద్యోగులకు రెండు రోజుల శిక్షణ లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన కనిగిరి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వి జి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు సేవలందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఈడి హరిబాబు జె ఎ ఓ ఎన్ మల్లిఖర్జునరెడ్డి ఎఈ ప్రసాద్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది నూతనంగా ఎంపికైన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు