టిటిడి సహకారంతో పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి చేస్తా : కుందూరు

తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో పృథులగిరి (పొదిలికొండ) లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే శాసనసభ్యులుగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా శనివారంనాడు పృథులగిరి నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన కుందూరు నాగార్జునరెడ్డికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు.

ప్రత్యేక పూజల అనంతరం పొదిలిటైమ్స్ తో నాగార్జునరెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లి దేవస్థాన అభివృద్ధికి కావలసిన నిధులు తీసుకువచ్చి ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని కొండపైకి రహదారి మరియు మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేస్తానని
ఆయన తెలిపారు. అనంతరం పలువురు దేవస్థానం అభివృద్ధి కొరకు వినతిపత్రాలను నాగార్జునరెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాయిరాజేశ్వరరావు, వాకా వెంకటరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, షేక్ మహబుబ్ బాషా, హనిమున్ శ్రీనివాసరెడ్డి, రోటీ రబ్బాని, షేక్ గౌస్, మరియు దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.