మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో పలువురు నేతలు…. ఎంఎల్ఏకు బయోడేటా సమర్పించిన జి శ్రీను, కల్లం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించడంతో పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై మండలంలోని పలువురు నేతలు దృష్టి కేంద్రీకరించారు.
నామినేటెడ్ పదవులలో బిసిలకు 29శాతం, యస్సీలకు 15శాతం, యస్టీలకు 6శాతం, మొత్తం 50శాతం రిజర్వేషన్లు మరియు మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జిఓ జారీ చేయడంతో పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఏ కేటగిరికి చెందుతుందో అనే అంశం ఆసక్తికరంగా మరింది.
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి బిసి కోటాలో అవకాశం కల్పించాలని కోరుతూ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి పొదిలి మండలం వైఎస్సార్ సిపి నాయకులు జి శ్రీనువాసులు తన బయోడేటాను అందజేశారని…. అదేవిధంగా మండలంలో మరో కీలకనేత అయిన కల్లం సుబ్బారెడ్డి కూడా నాగార్జునరెడ్డికి బయోడేటాను అందజేసినట్లు సమాచారం.
అదేవిధంగా మండల పార్టీ కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, మండల చెందిన మరో కీలకనేత అయిన వాకా వెంకటరెడ్డి మరికొంతమంది కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకునే యోచనలో ఉన్నారని సమాచారం.
వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఎంపికలోగా ఎంతమంది అశావహులు చైర్మన్ రేసులోకి వస్తారో… చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడవలసిందే.