కనపడకుండా పోయిన వృద్ధుడు మృతి

పొదిలి మండలం జువ్వలేరు గ్రామానికి చెందిన కసిరెడ్డి వెంకటేశ్వర్లు(90) ఈనెల 6వతేది నుండి కనిపించడం లేదంటూ గురువారంనాడు కుమారుడు వేంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు….. జువ్వలేరు గ్రామానికి 5కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఓ వృద్ధుడు మృతదేహం కూలిపోయిన స్థితిలో ఉందంటూ వచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కసిరెడ్డి వెంకటేశ్వర్లుగా గుర్తించి దర్యాప్తును ప్రారంభించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.