ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉత్తిర్ణత పత్రాల పంపిణీ

స్థానిక రథం రోడ్డులోని ఎస్ఎస్ ట్రైనింగ్ సెంటర్ నందు ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకం స్వయంఉపాధి శిక్షణలో భాగంగా టైలరింగ్, యానిమేషన్ ట్రైనింగ్ లో శిక్షణపొంది ఉత్తిర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్ఎస్ ట్రైనింగ్ సెంటర్ నందు పొదిలి ఎస్ఐ సురేష్ ఉత్తిర్ణత పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో పురుషులకు ధీటుగా మహిళలు పోటీపడుతూ ఉన్నారని….. ప్రభుత్వం అందించే ఇటువంటి పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంఘంలో గౌరవం లభించడమే కాక కుటుంబ పోషణలో కూడా ఆర్ధికంగా భాగస్వామ్యం పొందడానికి ఇది ఒక శుభపరిణామమని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శివప్రసాద్, శ్రీనివాసరెడ్డి, సుమలత, సుప్రజ, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.