పేద విద్యార్థికి చేయూత అందించిన హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవాసంస్థ

కొండెపికి చెందిన పేద విద్యార్థికి హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని రిటైర్డు పెన్షనర్ల భవనం నందు రిటైర్డు పెన్షనర్ల నాయకులు బాదుల్లా అధ్యక్షతన హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కొండెపికి చెందిన సిఏ విద్యార్థి భానుతేజ తన సిఏ కోర్సు పూర్తి చేయడానికి గాను…. హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ కరిముల్లా బేగ్ 10వేల రూపాయలు, విశ్రాంతి ఉద్యోగులు 5వేల రూపాయలు మొత్తం 15వేల రూపాయలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్ధిక సహాయం పొందిన విద్యార్థి భానుతేజ మాట్లాడుతూ తన చదువు పూర్తి చేయడంకోసం హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవాసంస్థ చేసిన మేలు మర్చిపోనని…. నా చదువుకోసం ఆర్ధిక సహాయం చేసిన ప్రతిఒక్కరికి ఋణపడి ఉంటానని అన్నారు.