నోట్ బుక్స్ పంపిణీ చేసిన వైసీపీ నాయకులు
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులురెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నాయకులు నోట్ బుక్స్ పంపిణీ చేసారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక బాలికల ఉన్నతపాఠశాల నందు మంగళవారం నాడు రోటీ యస్ధాన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నోటు బుక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రోజారాణి, వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు కంకణాల రమేష్, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ ఖాదర్ బాషా, ముల్లా జాకీర్ తదితరులు పాల్గొన్నారు.