సీపీఐ,సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
సీపీఐ, సిపిఎం నాయకులు బుధవారంనాడు రాస్తారోకో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే విశ్వనాథపురం సీపీఐ, సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక విశ్వనాథపురం ఒంగోలు-కర్నూలు రహాదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ…….
రెండవసారి కేంద్రంలో అధికారంలో వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వరాలు కురిపిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని….. సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని….. జిఎస్టీ ప్రభావంతో పరిశ్రమలు మూతపడుతుండడంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నా నిరుద్యోగ నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమవుతుందని అన్నారు.
మూకదాడులను నిర్ములించాలని కోరిన మేధావులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ప్రశ్నించేతత్వాన్ని కాలరాస్తూ మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు….. రిజర్వ్ బ్యాంకు నుండి తెచ్చిన 1,76,000కోట్లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడంతో చివరికి పిల్లలు తినే బిస్కెట్లు కూడా అమ్ముడుపోనంతగా ఆర్ధిక సంక్షోభం నెలకొందని…… డిమాండ్ తగ్గడంతో ఆటోమొబైల్ పరిశ్రమలు వాటి ఉత్పత్తులు తగ్గించుకొంటున్నాయని దీనివలన ఉద్యోగాలు కూడా ఉడిపోతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కోటేశ్వరరావు, ఏసురత్నం, పౌలు, పిచ్చయ్య, సిపిఎం నాయకులు బాల నరసయ్య, బాలక్రిష్ణ, లతీఫ్ బి, సురేష్, సిఐటియూ నాయకులు తిరుపతిరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్ మరియు వివిధ ప్రజాసంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.