ప్రాణంతీసిన ఈత సరదా…. ఇద్దరు మృతి
కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామంలో ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది.
గ్రామస్థులు కథనం మేరకు….. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకు వెల్దామని గ్రామ సమీపంలోని ఓ చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారని…. అందులో సోము రవి ముందుగా నీటిలోకి దిగి ఈదలేక పోవడంతో పైన ఉన్న నలుగురిలో మద్దూరు కొండారెడ్డి రవిని పైకి లాగేందుకు చేయి అందించగా ప్రమాదవశాత్తు అతనుకుడా నీటిలో పడిపోవడంతో మిగిలిన ముగ్గురు గ్రామంలోకి వెళ్లి స్థానికులకు విషయం తెలుపగా స్థానికులు వెళ్లి బయటకు తీసేలోపే ప్రాణాలు విడిచారని తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసునమోదు చేసి…. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.