భజనచేయడం కాదు… బాధ్యతగా పనిచేయడమే ఏపీజిఈఏ లక్ష్యం : జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు

భజనచేయడం కాదు బాధ్యతగా పని చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లక్ష్యమని జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు అన్నారు.

స్థానిక రోడ్లు మరియు భవనముల శాఖ అతిథిగృహంలో గురువారంనాడు జరిగిన పొదిలి తాలూకా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు మాట్లాడుతూ గతంలో ఉన్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగులను రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా చేసారే తప్ప ఉద్యోగుల హక్కుల సాధనకోసం చేసింది ఏమి లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఆగస్టులో జిఓ నెంబర్ 103ప్రకారం గుర్తింపు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంస్థ పటిష్టతకు జిల్లాలోని 14 తాలూకాలలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు ప్రసాద్ చంద్ర, అల్లూరయ్య, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.