సిపిఐ పట్టణ కార్యదర్శిగా కె వి రత్నం నియమాకం
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) పొదిలి పట్టణ కార్యదర్శిగా కె వి రత్నంను నియమించినట్లు జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ తెలిపారు .
స్ధానిక లెనిన్ భవన్ నందు శుక్రవారంనాడు జరిగిన సమావేశంలో ఎం ఎల్ నారాయణ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం పటిష్టతలో భాగంగా గతంలో విద్యార్థి సమాఖ్యలో పనిచేసిన కెవి రత్నంను పట్టణ కార్యదర్శిగా నియమాకం చేయడం జరిగిందన్నారు.
అలాగే త్వరలో కామ్రేడ్ కాశిరెడ్డి స్మారక స్థూపాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నియోజకవర్గ కార్యదర్శి అందేర నాసరయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకుని రావడానికి గ్రామ శాఖలను ఏర్పాటుచేసి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండలాల కార్యదర్శిలు ఏసురత్నం, కోటేశ్వరరావు, మండల నాయకులు వెంకటరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.