విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్ : సిఐ శ్రీరామ్

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారంనాడు స్థానిక వీరిశెట్టి కళాశాల నందు పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలను రక్షించడంలో అమరులైన పోలీసు అమరవీరులకు ఎంతగానో రుణపడి ఉన్నామని అమరులైన వీరులకు జోహార్లు తెలిపారు…. ఆ అమరవీరులను గుర్తు చేసుకోవడం కోసమే పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

పలువురు వక్తలు మాట్లాడుతూ పోలీసులు సమాజంలో ఉండడం వలనే ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా ధైర్యంగా ఉంటున్నామని….. సమాజంలో పోలీసులు పాత్ర ఏమిటి వారు ఏవిధంగా ఉండాలి అని అంశంపై విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ సురేష్, సీనియర్ సిటిజన్స్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.