పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలుపుకోవలని కోరుతూ వెలుగు యానిమేటర్లు ధర్నా

ఉద్యోగ భద్రత రూ.పదివేలు వేతన జిఒ, బకాయి వేతనాల వెంటనే ఇవ్వాలని కోరుతూ ఎపి వెలుగు విఒఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం (సిఐటియు అనుబంధం) ఆద్వర్యంలో ధర్నా చేసారు.

స్ధానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యలయం వద్ద సోమవారం నాడు ధర్నా నిర్వహించి అనంతరం స్పందన కార్యక్రమంకు హాజరైన స్ధానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నాగార్జున రెడ్డి దృష్టికి తమ డిమాండ్లునై వెలుగు విఒఎలకు ఉద్యోగ భద్రత కోసం హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.పదివేలు వేతనం జిఒ వెంటనే విడుదల చేయాలని, వేతనం ప్రభుత్వమే చెల్లించాలని, విఒఎ అకౌంటుకే వేతనం జమ చేయాలని పేర్కొన్నారు. విఒఎలు చేసే పనులు గ్రామ వాలంటీర్లకు, వెల్ఫేరు అసిస్టెంటులకు అప్పగించొద్దని డిమాండ్‌ చేస్తు తమ న్యాయం చెయ్యలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు యానిమేటర్లు సంఘం నాయకురాలు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు