ఎంఎల్ఏ స్పందన కార్యక్రమం విజయవంతం 57 అర్జీల్లో 15 అర్జీలు తక్షణమే పరిష్కారం

మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పాల్గొన్న స్పందన కార్యక్రమం విజయవంతమైంది.

వివరాల్లోకి వెళితే సోమవారం వారంనాడు స్ధానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలపై 57 దరఖాస్తులు రాగా అందులో 15 సమస్యలు తక్షణమే పరిష్కారం చేశారు. మిగిలిన దరఖాస్తులను విచారణ జరిపి పరిష్కరిస్తామని మండల రెవెన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బరాయుడు, మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు