మహారాష్ట్ర హర్యనా ఎన్నికలలో వార్ ఒన్ సైడ్…. ఎగ్జిట్ పోల్స్ బిజెపి వైపు మొగ్గు
మహారాష్ట్ర హర్యానా శాసనసభ ఎన్నికల్లో వార్ ఒన్ సైడ్ అయినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బిజెపి, శివసేన కూటమి మూడింట రెండొంతులు స్థానాలు దక్కుతాయని…. కాంగ్రెసు, ఎన్సీపీ కూటమికి నామమాత్ర సీట్లతో సరిపెట్టుకోవలసి వస్తుందని ఇతర పార్టీలు అసలు ఏమాత్రం ప్రభావం చూపలేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
మహారాష్ట్ర మొత్తం సీట్లు -288
న్యూస్18 అంచనాలు బిజెపి కూటమి 243…. కాంగ్రెస్ కూటమి 41….. ఇతరులు 4……. టైమ్స్ నౌ అంచనా ప్రకారం బిజెపి కూటమి 230 ….. కాంగ్రెస్ కూటమి 48…. ఇతరులు 10…. ఇండియా టుడే అంచనాల ప్రకారం బిజెపికి 166నుండి 194….. కాంగ్రెస్ కూటమికి 72-90 ఇతరలకు 22-34…… ఎబిపి అంచనాల ప్రకారం బిజెపి కూటమికి 204….. కాంగ్రెస్ కూటమికి 69 ఇతరులకు 15 స్ధానాలు దక్కతాయని అంచనా వేశాయి.
హర్యాన శాసనసభ మొత్తం స్ధానలు 90
హర్యాన శాసనసభ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలు మొత్తం 90 సీట్లు సొంతంగా పోటీ చేయగా…. జెజెపి, బియస్పీ కూటమిగా పోటీ చేశాయి
న్యూస్18 ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీ వైపు మొగ్గు చూపింది. హర్యానాలో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని తేల్చింది.
మొత్తం 90అసెంబ్లీ సీట్లున్న హర్యానాలో బీజేపీ 75 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో తేల్చగా, కాంగ్రెస్కు కేవలం 10 సీట్లు జెజెపి 3 సీట్లు, ఐఎన్ఎల్డీకి ఖాతా తెరిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.