బాలికల ఆత్మరక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రత్యేక శిక్షణ : రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రవి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బాలికల ఆత్మరక్షణ లక్ష్యంగా 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రవికి స్థానిక తాలూకా ఆఫీసు వీధిలోని కరాటే మాస్టర్ వేణు కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రవి పొదిలి మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు కరాటేలో ఇస్తున్న శిక్షణా తరగతుల పర్యవేక్షణలో భాగంగా పొదిలికి విచ్చేసిన సందర్భంగా స్థానిక తాలూకా ఆఫీసు వీధిలోని కరాటే మాస్టర్ వేణు కార్యాలయంలో మాస్టర్ వేణు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాస్టర్ రవి మాట్లాడుతూ నేటి సమాజంలో ఏ క్షణం ఎలా అయినా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో బాలికలు వారి ఆత్మరక్షణపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు తీసుకోవడం వలన వారిని వారు కాపాడుకోవడం….. అలాగే వారి ఆత్మరక్షణకు ఎవరో వచ్చి సహాయం చేసేవరకు వేచిచూడకుండా పరిస్థితిని ఎదుర్కొనే విధంగా తయారుచేయడమే లక్ష్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు నేర్పించడం జరుగుతుందని…. అలాగే ప్రకాశం జిల్లా కరాటే మాస్టర్లు ఎంతో ప్రతిభ కలవారని వీరివద్ద ఆత్మరక్షణ శిక్షణ పొందడం ద్వారా శిక్షణ తీసుకున్న శిష్యులు కూడా అంతే ప్రతిభావంతులు అవుతారని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆత్మరక్షణ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని…. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ ప్రత్యేక శిక్షణ తరగతులకు ఆహ్వానం పలికాయని తెలిపారు.