ద్విచక్రవాహనాల ఢీ….ఇరువురికి తీవ్రగాయాలు…. ఒకరి పరిస్థితి విషమం

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే దర్శికి చెందిన పంచాల బాలకృష్ణ కంభంలో గల తన అత్తారింటికి వెళ్లేందుకు మోటారు సైకిల్ వెళ్తుండగా……

చీమకుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇనుకొల్లు వెంకట్రావు తన అత్తగారి ఊరైన పేరారెడ్డిపల్లి నుండి మోటార్ సైకిల్ పై వస్తున్న క్రమంలో ఇరువురి వాహనాలు కంభాలపాడు వద్ద పరస్పరం ఢీకొనడంతో బాలకృష్ణ, వెంకట్రావులు ఇరువురు తీవ్రంగా గాయపడగా స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి….. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలుకు తరలించారు.

అనంతరం బాలకృష్ణకు పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఒంగోలు నుండి చెన్నై కు తరలించినట్లు సమాచారం.