ఆకట్టుకున్న జిల్లాస్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన
స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన 27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2019 కార్యక్రమం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ “జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టుల ప్రదర్శనలు తిలకించి అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశనుండే పిల్లలకు వారియొక్క ప్రతిభ మరియు ఆసక్తిని గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని….. నేడు విద్యార్థులుగా ప్రదర్శనలు ఇచ్చిన వీరే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ముఖ్యఅతిథి అయిన మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి దశనుండి ఇటువంటి ప్రాజెక్టులు తయారు చేయడం విద్యార్థులలో, సృజనాత్మకత పెంపొందించి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని అన్నారు.
ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మొత్తం 240ప్రాజెక్టులను ప్రదర్శించారని అన్ని చూపరులను బాగా ఆకట్టుకున్నాయని…. అందులో భాగంగా పలు పాఠశాలల విద్యార్థులు సైన్సుకు సంబంధించిన కథానికలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగేలా ప్రదర్శించిన విద్యార్థులు నైపుణ్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య, దాసరి గురుస్వామి, పూర్ణచంద్రరావు, రంగారావు, రామచంద్ర రావు, రవి శేఖర్, రవి శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, జగన్, మరియు పలువురు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.