పొదిలిటైమ్స్ అవార్స్-2019….ఉత్తమ ప్రజాప్రతినిధి అవార్డు గ్రహీత సాయి

పొదిలిటైమ్స్అవార్డ్స్-2019 అవార్డు గ్రహీతగా మాజీ జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు వి సాయి రాజేశ్వరరావును ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రెవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి మండలం నుండి జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ప్రాతినిధ్యం వహించిన సమయంలో జిల్లా పరిషత్ నిధులతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అలాగే మండలంలో ఉన్న పలు పాఠశాలలో హిందుస్థాన్ పెట్రోల్ వారి సౌజన్యంతో మంచినీటి శుద్ధి యంత్రాల ఏర్పాటులో కృషి చేయడం మండల అభివృద్ధిలో భాగస్వామి అవడమే కాకుండా పొదిలి పెద్దచెరువును సాగర్ నీటితో నింపు ప్రతిపాదనను ముందుకు తీసుకుని వచ్చి అప్పటి పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన ద్వారా కేంద్ర జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపించడం ద్వారా పొదిలి తీవ్ర నీటి సమస్య వెలుగులోకి రావడంతో అప్పటి అధికార పక్షం వాటర్ గ్రిడ్ లో భాగంగా పొదిలి పెద్ద చెరువును సమ్మర్ స్టోరేజ్ గా మారుస్తామని ప్రకటించడంలో సాయి పాత్ర కీలకమైనది…..

ఇదే అంశంపై జిల్లా పరిషత్ సమావేశంలో నిరసన వ్యక్తంచేసి బహిష్కరణ చేయడం తదుపరి జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం జరిపించడం ఒక కీలకమైన అంశం….. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 98రోజు పొదిలికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో జగన్మోహన్ చేత పొదిలి పెద్ద చెరువును రిజర్వాయర్ గా మారుస్తానని హామీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించడం అందులో భాగంగా జలదీక్ష కార్యక్రమం నిర్వహించడంతో పాటు వ్యక్తిగతంగా పలు సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తూ, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ…. తనదైన శైలిలో పనిచేసిన సాయి రాజేశ్వరరావు ను పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.