పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ ఆటో డ్రైవర్ అవార్డు గ్రహీత ఖాదర్ భాష

పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ ఆటో డ్రైవర్ అవార్డు గ్రహీతగా షేక్ ఖాదర్ భాషాను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రెవేటు లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి మండల పరిధిలో తన సొంత ఆటోలో గర్భిణీలకు ఉచితంగా రవాణా సౌకర్యం చేయడం…. మరియు అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేయడంతో తోటి ఆటో కార్మికులకు మార్గదర్శికుడిగా ఉంటూ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల మనస్ను చొరగొన్నారు.

ఆయన సేవలను గుర్తించి టైమ్స్ మీడియా ప్రెవేటు లిమిటెడ్ యాజమాన్యం ఉత్తమ ఆటో డ్రైవర్ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.