పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ వైద్య సేవా అవార్డు గ్రహీత చాగంటి అరుణ

పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ వైద్య సేవా అవార్డు గ్రహీతగా చాగంటి అరుణను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు గత మూడు సంవత్సరాల నుండి ఉత్తమ సేవలు అందిస్తుండడంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ వైద్య సేవా విభాగంలో ఉత్తమ అవార్డు అందుకుని ఆమె సేవలతో ప్రజల మన్ననలు చొరగొన్నారు.

ఆమె సేవలను గుర్తిస్తూ ఉత్తమ వైద్యసేవా అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.