లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని బీజేపీ నేత కన్నాకు ఆహ్వానం పంపిన జనసేన

సూత్రప్రాయంగా అంగీకారించిన కన్నా

బీజేపీ, జనసేన బంధానికి రంగం సిద్ధం !

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతూ…. భవన నిర్మాణ కార్మికుల అక్కలికేకలు, ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా
జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన లాంగ్ మార్చ్ కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హాజరుకావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక పాలసీ అమలులో వైఫల్యానికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీన సోమవారం నాడు తలపెట్టిన లాంగ్ మార్చ్ కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణను ఆహ్వానించడం దానికి ఆయన అంగీకారం తెలపడం చకచక జరిగిపోయాయి… దానితో బీజేపీ జనసేన పార్టీల మధ్య రాజకీయ మైత్రి మొదలైనట్లు అనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీతో మరలా దోస్తీకంటే జనసేన పార్టీతో కలిసి పనిచేయడం ద్వారా బలం పెంచుకోవచ్చని భారతీయ జనతా పార్టీ భావిస్తోందని సమాచారం.