రక్షకబటులకే రక్షణ కరువైందా?… 11గంటల విధుల బహిష్కరణ అనంతరం విధుల్లోకి పోలీసులు
రక్షకబటులకే రక్షణ కరువైందంటూ ఢిల్లీ పోలీసులు విధులను బహిష్కరించి పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని తీస్ హజారే కోర్టు ప్రాంగణంలో శనివారం మరియు సోమవారం నాడు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు న్యాయవాదులకు పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ చిలికిచిలికి గాలివానలా పెనుదుమారమే లేపింది……. పోలీసులకు న్యాయవాదులకు జరిగిన గొడవ వలన ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకుని వాహనాలను ధ్వంసం చేసుకున్నారు……. ఈ దాడిలో 20పోలీసులకు పలువురు న్యాయవాదులకు గాయాలుకాగా…….
సోమవారం నుండి న్యాయవాదులు ధర్నాకు దిగారు…. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మాపై దాడి చేసిన న్యాయవాదులపై కేసులు నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులు 11గంటల పాటు విధులను బహిష్కరించి పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు ఆందోళనకు దిగగా….. మీకు న్యాయం చేస్తామని ఆందోళన విరమించి విధులలో చేరాలని స్పెషల్ కమిషనర్ సతీష్ గోల్చా విజ్ఞప్తి చేశారు……
ఆందోళన చేపట్టిన పోలీసులపై ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోబోమని…. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని అలాగే 25వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తామని…. అలాగే జరిగిన గొడవపై ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో పోలీసులు ఆందోళన విరమించి విధులలో చేరారు.