భారత కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిసా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) రాష్ట్ర సమాచార కమిషన్ (యస్ఐసి)లలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయకపోవడంపై తక్షణమే వాటి యొక్క తాజా స్ధితి తెలుపుతూ నివేదికను నాలుగు వారల్లో సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.